టూరిస్టు బస్సు బోల్తా: ఆరుగురు మృతి

Private Bus Accident Near Penuganchiprolu
Private Bus Accident Near Penuganchiprolu

టూరిస్టు బస్సు బోల్తా: ఆరుగురు మృతి

పెనుగంచిప్రోలు: ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు బోల్తాపడిన సంఘటనలో ఆరుగురు మృతిచెందారు.. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈ బస్సుముళ్లపూడి వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొని రహదారిపై బోల్తా కొట్టింది.. తదుపరి రహదారి నుంచి కల్వర్టు మధ్యలోపడి పోయింది.. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు.. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. బస్సు కల్వర్టులో ఇరుక్కుపోవటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలిసింది.