టీ20లో భారత్‌ విజయం

KULDEEP YADAV-
KULDEEP YADAV-

టీ20లో భారత్‌ విజయం

ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌ ఖాతాలో మరో విజయం దక్కింది .భారత బౌలర్లు చెలరేగిపోయారు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కాసేపు అయినా…క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా ఆరంభం నుంచి వికెట్లు పడగొడుతూ…విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్‌ 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. చివర్లో అలెన్‌ (20బంతుల్లో 4ఫోర్లతో 27), పాల్‌ (13 బంతుల్లో 2ఫోర్లతో 15) మెరిపించడంతో విండీస్‌ గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. 110 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ విండీస్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. పరుగుల కోసం చెమటోడ్చాల్సిన వచ్చింది. అయిన చివర్లో కార్తీక్‌, క్రునాల్‌ పాండ్యా చేలరేగి అడడంతో విండిస్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్ల దాటికి విండీస్‌ విలవిల… టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ తొలి ఐదు ఓవర్లు ముగిసే సరికే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. ముందుగా రామ్‌దిన్‌ (5బంతుల్లో 2) ఉమేశ్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ చేతికి చిక్కగా, నాలుగో ఓవర్‌లో షైహోప్‌ (10బంతుల్లో 3ఫోర్లతో 14) కుదురుకునే సమయంలో లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. మరుసటి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన హెట్‌మెయిర్‌ (7బంతుల్లో 2ఫోర్లతో 10) కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం పొలార్డ్‌ (26బంతుల్లో ఒక సిక్సర్‌తో 14) పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ భారత బౌలర్లను ఎదుర్కోలేక కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద పాండే చేతికి చిక్కాడు. కృనాల్‌కిది తొలి అంతర్జాతీయ వికెట్‌. ఆ తర్వాత కుల్దీప్‌ వెంటవెంటనే బ్రావో (10బంతుల్లో 5), పావెల్‌ (13బంతుల్లో 4), బ్రాత్‌వైట్‌ (11 బంతుల్లో 4) తన స్పిన్‌ ఉచ్చులో బోల్తా కొట్టించాడు. చివర్లో అలెన్‌ (20బంతుల్లో 4ఫోర్లతో 27) కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా…ఖలీల్‌ వేసిన 18వ ఓవర్‌ చివరి బంతికి ఉమేశ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో విండీస్‌ 109 పరుగులు తక్కువ స్కోరుకే పరిమి తమైంది.భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా…ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మ ద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది.

భారత్‌ బ్యాటింగ్‌ సాగిందిలా….
110 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముచ్చెమటలు పట్టించారు. విండీస్‌ బౌలర్ల దాటికి భారత్‌్‌ ఆదిలోనే తడబాటుకు గురైంది. తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది. 6బంతుల్లో 6 పరుగులు చేసిన రోహిత్‌, ఒషేన్‌ థామస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో రెండో వికెట్‌ కోల్పోయింది. థామస్‌ బౌలింగ్‌లోనే 8బంతుల్లో3పరుగులు చేసిన ధావన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో మూడు ఓవర్లకు భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది.ఆ తర్వాత 5.3వ బంతికి రిషబ్‌ పంత్‌(4)ను, 7.3ఓవర్‌ బంతికి లోకేశ్‌ రాహుల్‌ (22బంతుల్లో 2ఫోర్లతో 16)ను బ్రాత్‌వైట్‌ ఔట్‌ చేశాడు. వీరిద్దరి క్యాచ్‌లను బ్రావోనే అందుకోవడం విశేషం.45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ కష్టాల్లో పడింది. పరుగుల వేగం మందగించింది. 10ఓవర్లు ముగిసే సమయానికి 4వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. తరువాత క్రీజులో ఉన్న కార్తీక్‌, పాండ్యా జాగ్రత్తగ అడే క్రమంలో పిర్రె బౌలింగ్‌లో ప్యాండ్యా క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరడు. తరువాత క్రీజులోకి వచ్చిన క్రునల్‌ పాండ్యా, కార్తీక్‌లు సునయాసంగా అడి కార్తీక్‌ 34బంతుల్లో 31 పరుగులు , క్రునాల్‌ పాండ్యా 9 బంతుల్లో 21 పరుగులు చేసి 17.5 ఒవర్‌లో 110 పరుగులు చేయడంతో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.