టీమిండియా 377 డిక్లేర్‌

JADEJAFF
Team India 377 Declared

టీమిండియా 377 డిక్లేర్‌

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న భారత క్రికెట్‌ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ ఆధిక్యం సాధించింది.కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్లకు 377వద్ద రెండవ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 56 పరుగులు కలుపుకుని 434 పరుగులు భారీ టార్గెట్‌ను కోహ్లీ సేన కివీస్‌ ముందుంచింది.కాగా టీమిండియా 1 వికెట్‌కు 159 పరుగులు ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఆదివారం రెండవ ఇన్నింగ్స్‌ కొనసాగించగా మురళీ విజ§్‌ు 76 పరుగులు,పుజారా 78 పరుగులతో తొలి సెషన్‌లో ఎక్కువ సేపు నిలువలేకపోయారు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ 93 బంతులు ఆడి 8 బౌండరీలతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా జడేజా 58 బంతులు ఆడి 2 బౌండరీలు,3 సిక్సర్లతో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మెరుపు హాఫ్‌ సెంచరీలు బాదడంతో 377 పరుగులు భారీ స్కోరు చేయగలిగింది. పట్టు బిగించిన టీమిండియా కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చారిత్రాత్మక 500 టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టు బిగించింది.కాగా టెర్గెట్‌కు 341 పరుగుల దూరంలో ఉన్న న్యూజిలాండ్‌ గెలిచే అవకాశాలు చాలా తక్కువ.టీమిండియా ఆదివారం 434 పరుగులు టార్గెట్‌ను న్యూజిలాండ్‌ ముందుంచింది. కాగా రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌ నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 93 పరుగులు చేసి కష్టాల్లోకి వెళ్లింది. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న కాన్పూర్‌ పిచ్‌పై నేడు జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఎంత త్వరగా కివీస్‌ను ఔట్‌ చేస్తానరే దానిపై ఫలితం ఆధారపడి ఉంది. న్యూజిలాండ్‌ నెగ్గాలంటే మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 4 వికెట్లకు 93 పరుగులు చేసింది.

కాగా న్యూజిలాండ్‌ నెగ్గాలంటే మరో 341 పరుగులు చేయాల్సి ఉంటుంది.అంతకు ముందు 1 వికెట్‌కు 159 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్‌ కొనసాగించిన కోహ్లీ సేన 5 వికెట్లకు 377 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.దీంతో భారత్‌ ఓవరాల్‌గా కివీస్‌ ముందు 434 పరుగులు టార్గెట్‌ నిలిపింది.కాగా 434 పరుగులు టార్గెట్‌తో రెండవ ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌కు సత్తాకు విలవిల్లాడింది.ఇన్నింగ్స్‌ నాలుగవ ఓవర్‌లో కివీస్‌ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు.ఆ ఓవర్‌లో తొలి బంతికి గుప్టిల్‌ ను డకౌట్‌ చేసిన అశ్విన్‌,అయిదవ బంతికి లాథమ్‌ 2 పరుగుల వద్ద ఔట్‌ చేశాడు.ఆ తరువాత కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 25 పరుగుల వద్ద అతని వికెట్‌ తీసి రెండు వందల వికెట్‌ వీరుల క్లబ్‌లో చేరాడు.నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి రాంచీ 36 పరుగులు,సాంట్నర్‌ 8 పరుగులు వద్ద నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. మరోసారి నిరాశ పర్చిన కోహ్లీ కెప్టెన్‌ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన కోహ్లీ రెండవ ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా 40 బంతుల్లో 3 బౌండరీలు చేసి కుదరుకుంటున్నట్లు కనిపించిన కోహ్లీ క్రెయింగ్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. కాగా టీమిండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 318 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 262 పరుగులు చేసి ఆలౌటైంది.

జడేజా విన్యాసం న్యూజి లాండ్‌తో జరుగుతున్న చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో ఆదివారం ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.ఇప్పుడు వైరల్‌గా మారిన ఆ వీడియో అభిమానులను అమితంగా ఆకట్టు కుంటుంది.ఓవర్‌ నైట్‌ స్కోరు 1 వికెట్‌కు 159 పరుగులతో రెండవ ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ టీ విరామ సమయానికి కొద్ది నిముషాల ముందు 5 వికెట్లకు 377 పరుగులతో భారీ ఆధిక్యం దిశలో ఉంది.ఇదే దశలో జడేజా 58 బంతులు ఆడి 2 బౌండరీలు,3 సిక్సర్లతో 50 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేశాడు.దీంతో కోహ్లీ భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌చేశాడు. అయితే అప్ప టికే హాఫ్‌ సెంచరీ ఆనందంతో జడేజా బ్యాట్‌ను కత్తిలా మైదానంలోతిప్పుతూ సంబరాలు చేసు కుంటూ ఉండటాన్ని గమనించిన కోహ్లీ నవ్వుతూ అలానే పెవిలియన్‌కు రమ్మని సైగ చేశాడు.