టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారు

Team indai
Team indai

టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారు

న్యూఢిల్లీ:ఛాంపియన్స్‌ ట్రోపీ అనంతరం కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు వన్డేలు, ఒక టి20 ఆడనుంది. జూన్‌ 23నుంచి ప్రారం భంకానున్న ఈపర్యటన జూలై 9తో ముగియ నుంది. వెస్టిండీస్‌ పర్యటన అనంతరం 10రోజుల విరామం తర్వాత భారత్‌, శ్రీలంకలో పర్యటిం చనుంది. ఈక్రమంలో ఆతిథ్య జట్టుతో భారత్‌ 3 టెస్టులు, 5వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. ఇం దుకు సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ తాజా గా విడుదల చేసింది. జూలై 26 నుంచి సెప్టెంబర్‌ 6 మధ్య ఈమ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకు ముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడ నుంది. 2015లో భారత్‌-శ్రీలంకల మధ్య జరిగినటెస్టు, వన్డే సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. వార్మప్‌ మ్యాచ్‌లు : జూలై 21, 21 తేదీలలో టెస్టులు : మొదటి టెస్టు: జూలై 26-30 (క్యాండీ), రెండో టెస్టు: ఆగస్టు 4-8 (గాలే), మూడో టెస్టు: ఆగస్టు 12-16 (కొలంబో) వన్డేలు : తొలి వన్డే ఆగస్టు 20, రెండో వన్డే: ఆగస్టు 24, మూడో వన్డే: ఆగస్టు 27, నాలుగో వన్డే: ఆగస్టు 30, ఐదో వన్డే: సెప్టెంబర్‌ 3, ఏకైక టీ20: సెప్టెంబర్‌ 2.