టీమిండియాకు సచిన్‌ కీలక సూచనలు..

sachin tendulkar
sachin tendulkar

ముంబై: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియాకు కీలకమైన సూచనలు చేశారు. టెస్ట్‌ సిరీస్‌లో ఓపెనర్లదే భారమని సచిన్‌ స్పష్టం చేశారు. 30 నుంచి 35 ఓవర్ల వరకు ఓపెనర్లు క్రీజులోనే ఉండే ప్రయత్నం చేయాలని అన్నాడు. అలా చేయటం వల్ల కఠినమైన పరిస్థితుల్లో కొత్త బంతిని ఎదుర్కోవాల్సిన అవసరం మిడిలార్డర్‌కు ఉండదని చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌ కనీసం 30 ఓవర్ల వరకు ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లినపుడు ఓపెనర్లే చాలా కీలకంగా మారతారు అని తెలిపారు. ఆసీస్‌ టీంలో వార్నర్‌, స్మిత్‌ లేకపోవడం కూడా టీమిండియాకు కొంత కలిసొచ్చే విషయమేనని సచిన్‌ స్పస్టం చేశాడు.