టీమిండియాకు కొత్త జెర్సీ

S10
Team india

టీమిండియాకు కొత్త జెర్సీ

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కొత్త కెప్టెన్‌తో పాటు మరో రెండు రోజుల్లో సీజన్‌ తొలి మ్యాచ్‌ను టీమిండియా ఆరంభించనుంది. వీటికి తోడు భారత్‌ జెర్సీలో కూడా మార్పులు చేసి వన్డే జట్టు నూతన జెర్సీని బిసిసిఐ గురువారం ఆవిష్కరించింది.ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టుకు నైకి సంస్థ దుస్తులతో పాటు వివిధ పరికరాలకు స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరిస్తుంది.ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను రి సైకిల్‌ చేయగా వచ్చిన ఉత్ప త్తులతో 2015లో జెర్సీని తయారు చేసిన నైకి ఈ ఏడాది వెరైటీ డిజైన్లతో జెర్సీని రూపొం దించింది.భుజాలపై త్రివర్ణ రంగులతో చారలను ముద్రించింది.వచ్చే ఆదివారం నుంచి పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరుగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది