టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తా

అమరావతి: టిడిఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని టిడిపి ఎమ్మెల్యె గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని తమ అధినేత చంద్రబాబును కోరుతానని చెప్పారు. కాగా పార్టీ సీనియర్లపై ఆయన మండిపడ్డారు. పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు, ఆరు సార్లు ఓడిపోయిన వారికి కూడా పార్టీలో అంత ప్రాధాన్యతను ఎందుకిస్తున్నారని సొంత పార్టీపైనే అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశాలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/