టీటీడీకి ఎదురు దెబ్బ

thirupathi devasthanam
thirupathi devasthanam

తిరుమల:  టీటీడీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిరాశీ అర్చకులను రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, తిరుచానూరు ఆలయాల్లో రిటైర్మెంట్ నిబంధనలను టీటీడీ అమలు చేస్తోంది. అయితే టీటీడీ నిర్ణయంపై తిరుచానూరు మిరాశీ వంశీకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు మీరాశీ అర్చకులకు అనుకూలంగా రావడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో టీటీడీ ఉన్నట్టు సమాచారం