టీజేఎస్‌ యువజన విభాగం ఏర్పాటు

kodandaram
kodandaram

హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి పార్టీకి అనుబంధంగా యువజన సమితి రాష్ట్ర కో ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యువజన విభాగం నేతలు సమావేశమయ్యారు. విభాగం బలోపేతం కావడం కోసం కోదండరాం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న స్వార్థ, అసమర్థ రాజకీయాలను సమూలంగా మార్చడానికి యువత పెద్ద సంఖ్యలో యువజన సమితిలో చేరాలని పిలుపునిచ్చారు. భారీగా సభ్యత్వ నమోదు, యువజన విభాగం నిర్మాణంపై తక్షణకే దృష్టి సారించాలని యువజన నాయకులను కోదండరాం సూచించారు. తెలంగాణ యువజన సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్లు : ఓయూ : ఆశప్ప, సలీం పాష, కల్వకుర్తి ఆంజనేయులు, పూసల రమేశ్‌, హైదరాబాద్‌ : విన§్‌ు, రమణ్‌ సింగ్‌, నరైన్‌, వికారాబాద్‌ : పూడూరి అజ§్‌ు, సూర్యాపేట : వెంకట్‌రెడ్డి, కేయూ : శేషు, డా.సంజీవ్‌, డా. విజ§్‌ు, భూపాలపల్లి : దాసరి శ్రీను, కొత్తగూడెం : భరత్‌లను నియమించారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ నేతలు ప్రొ.విశ్వేశ్వరరావు, జి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.