టీచ‌ర్ల నియామ‌కానికి ముందే ప‌దోన్న‌తులు

promotion
promotion

హైద‌రాబాద్ః టీఆర్‌టీ ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకానికి ముందే ఏకీకృత సర్వీసుతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్ యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌పై హైకోర్టులో ఉన్న స్టేట్‌సకో ఎత్తివేయించేందుకు గట్టిగా వాదించాలని అడ్వకేట్‌ జనరల్‌ ప్ర కాశ్‌రెడ్డిని కోరానన్నారు. ఉపాధ్యాయులపై సానుకూలంగా ఉన్నామని, కొందరు ఉపాధ్యాయుల పట్ల విమర్శలొస్తే అందరూ ఆపాదించుకోవద్దన్నారు.