టి 20కి టీమిండియా స‌న్న‌ద్ధం

TEAMINDIA
TEAMINDIA

కోల్‌క‌త్తాః సొంతగడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లు సొంతం చేసుకొని మంచి జోరుమీదున్న టీమ్‌ఇండియా ఇక టి 20పై దృష్టిసారించింది. రెండు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీసేన టీ20 సిరీస్‌నూ చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్‌కు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు ఈడెన్‌లో కసరత్తులు ప్రారంభించింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ రేపు కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్‌లో ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు.. కోచ్, సహాయ సిబ్బంది పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తున్నారు.