టి-కేబినెట్‌పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Srinivas goud
Srinivas goud

హైదారాబాద్‌: గతంలో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను తిట్టినవారే ఇప్పుడు రాష్ట్ర కేబినేట్‌లో కొనసాగుతున్నారంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరవక ముందే టిఆర్‌ఎస్‌ శాసనసభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌ కూడా తాజాగా ఆ తరహా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు తెలంగాణ కెటినేట్‌లో ఉన్నారని, అది తలుకుకుంటే తన కళ్లనుంచి నీళ్లు వస్తున్నాయని అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అప్పట్లోనే పడగొట్టాలని కొందరు అనుకున్నారని, ఆ సమయంలో కెసిఆర్‌ రాష్ట్ర కేబినెట్‌ విషయంలో ఇష్టం లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని అన్నారు. కెసిఆర్‌ నిర్ణయం వెనక బలమైన కారణం ఉండి ఉంటుందని వ్యాఖ్యానించారు.