టి.కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటి సమావేశం

Congress Party
Congress

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటి సమావేశం ఈరోజు ప్రారంభమైంది. భక్త చరణ్ దాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో అభ్యర్థుల జాబితా ఖరారు, మిత్ర పక్షాలకు కేటాయించాల్సిన స్థానాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 57 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మహాకూటమిలో సీట్ల కేటాయింపు కొలిక్కివచ్చాక ఒకేసారి మొత్తం జాబితా విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం