టి-ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.12 కోట్లు!

TSRTC
TSRTC

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి భారీగా ఆదాయం సమకూరింది. ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సాధారణ ఆదాయం రూ.9.75 కోట్లు వచ్చింది. సంక్రాంతి స్పెషల్‌ ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకు రూ.11 కోట్లు ఆదాయం సమకూరింది. మొత్తం 12 కోట్ల ఆదాయం ఈ పండుగ సీజన్‌లో వచ్చినట్లు టిఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ పది రోజులు రెగ్యులర్‌ బస్సులకు అదనంగా అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు..తెలంగాణలోనూ 4200 ప్రత్యేక బస్సులను నడిపారు. కాగా గత సంవత్సరం ఇదే సంక్రాంతి పండుగ సీజన్‌లో 11 కోట్లు ఆదాయం రాగా..ఈఏడాది అది పెరిగి రూ.12 కోట్లకు చేరుకుందని టిఎస్‌ఆర్టీసీ అధికారులు వివరించారు.