‘టిష్యూ థెరపీతో అందంగా..

LADY222
Lady

‘టిష్యూ థెరపీతో అందంగా..

ఆర్థిక సంపదకు మీకు లోటు లేదనకుంటే పటిష్టమైన ఆరోగ్యం కోసం, యంగ్‌లుక్‌ కోసం బాగా డబ్బు ఖర్చుపెట్టగలిగితే విదేశాల్లో లభించే డీప్‌ టిష్యూ థెరపీని మీరు తీసుకోవచ్చు. దీంతో టాక్సిన్స్‌, సెల్యులైట్‌ బయటపడతాయి. మజిల్స్‌ టోన్‌అప్‌తో బాడీ ఒక షేప్‌లోకి వస్తుంది. మసాజ్‌తో మీరు సెల్యులైట్‌ నుండి విముక్తి పొందవచ్చు. యాంటీ సెల్యులైట్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయించుకోవాలి. మనదేశంలో ఉన్న బ్యూటీపార్లర్స్‌లో ఎన్నో రకాల హెర్బల్‌ ఆయిల్స్‌ లభిస్తున్నాయి. వీటితో మసాజ్‌ చేయించుకుంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నూనె చర్మంలోకి ఇంకిపోయి కొవ్ఞ్వ కరుగుతుంది. దీనితో చర్మం మృదువ్ఞగా తయారవ్ఞతుంది. కొలేజన్‌ ఫైబర్‌ నిర్మాణాన్ని నియంత్రిస్తుంది. వ్యాయామంతో రక్తప్రసారాన్ని పెంచవచ్చు. సెల్యులైట్‌ ప్రభావిత అంగాల్లో రక్తం బాగా ప్రవహించి, శరీరంలోని అనవసరపు కొవ్వు పదార్థాన్ని తొలగిస్తాయి.

(ఉదా: ఏరోబిక్స్‌, నృత్యం). శరీరంలోని ఓ ప్రత్యేకమైన భాగం సెల్యులైట్‌ ప్రభావితమైనదని భావిస్తే ఆ భాగానికి సరిపడా వ్యాయామం చేయగలిగితే చాలు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సెల్యులైట్‌కి చికిత్స ఉండేదికాదు. కాని ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఎడమలోజీ టెక్నిక్‌ను రూపొందించారు. దీంతో సెల్యులైట్‌ను తాత్కాలికంగా తొలగిస్తారు. పళ్లు,కూరగాయల జ్యూస్‌ తీసుకుంటే ఎంతో ఉపయోగకంగా ఉంటుంది. అయితే వీటిని పరగడుపునే తీసుకోవాలి. అప్పుడు ఉపయోగం. బ మరోమార్గం ఉంది. మీరు స్నానం చేసేటప్పుడు మెత్తని హ్యాండ్లీ బ్రష్‌తో ఒక రాడ్‌లాగా చర్మంపై మసాజ్‌ చేస్తే (సబ్బులు ఉపయోగించని ప్రాంతంలో) రక్తప్రసరణ బాగా జరుగుతుంది. సెల్యులైట్‌ పేరుకున్న భాగం కరిగిపోతుంది. బ సెల్యులైట్‌ కొవ్ఞ్వను కరిగించటానికి కేవలం డైట్‌తో సాధ్యం కాని పని. డైటింగ్‌తో జీర్ణశక్తి బలహీన పడుతుంది. శరీరానికి కావలసిన కొన్నిపదార్థాలు శక్తి పతనమౌతాయి.