టివిఎస్‌ నుంచి అధునాతన విక్టర్‌

TVS
హైదరాబాద్‌ : ద్విచక్రవాహన తయారీకంపెనీల్లో భారీ కంపెనీ టివిఎస్‌మోటార్స్‌ తాజాగా టివిఎస్‌ విక్టర్‌ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ సేల్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జెఎస్‌శ్రీనివాసన్‌ ఈ బైక్‌ను లాంఛనంగా తెలంగాణ మార్కెట్‌కు విడుదలచేసారు. 2002లో ప్రవేశపెట్టిన టివిఎస్‌విక్టర్‌ తొలిసారే విజయవంతం అయిందని, భారత్‌లో టివిఎస్‌ మోటార్స్‌కు పునాదులు వేసిందన్నారు. ప్రస్తుతం టివిఎస్‌ విక్టర్‌ ప్రపంచ స్థాయిలో ఉత్పత్తి అవుతోందని, పనితీరుకు సంబంధించి ధృఢంగా ఉంటుందన్నారు. 2002లో విడుదయిన సమయంలోనే ప్రతినెలా 40వేల యూనిట్లు విక్రయించి నట్లు టివిఎస్‌ శ్రీనివాసన్‌ వెల్లడించారు. ఇపుడు తాజాగా టివిఎస్‌ విక్టర్‌ కొత్త మోడల్‌లో ఆధునిక స్టయి లింగ్‌, అత్యుత్తమమైన ఇంజన్‌పనితీరు, తనశ్రేణిలో మార్గదర్శకమైన సౌకర్యాల విశిష్టమైన ఓకలయికగా ఉందన్నారు. అత్యాధునికమైన స్టైల్‌3 వాల్వ్‌ ఎకో థ్రస్ట్‌ ఇంజన్‌ఉందని, అత్యధికశక్తి మైలేజి రెండింటినీ అందిస్తుందని శ్రీనివాసన్‌ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ 4స్పీడ్‌ పవర్‌ట్రైన్‌ వల 80-00 ఆర్‌పిఎం శక్తితో ఉంటుంది. 6000 ఆర్‌పిఎంతో 9.4ఎన్‌ఎంటార్క్‌ సాధించేలా చేస్తుందని వెల్లడించారు. పెట్రోలు నింపిన ఫ్రంట్‌ టెలిస్కోప్‌ సస్పెనష్టన్‌, వెనుకవైపు ఐదు స్టెప్‌అడ్జస్టబుల్‌ హైడ్రాలిక్‌ సిరీస్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌ ప్రయాణాన్ని నిర్వహణను సులభతరం చేస్తాయన్నారు. విశాలమైన సీటు కూడా మోటార్‌సైకిల్‌కు అదనంగా జత చేస్తుందని, టివిఎస్‌ విక్టర్‌ కొత్త అద్దాలు, ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానల్‌తో వచ్చిందన్నారు. 55వాట్స్‌ హెడ్‌లైట్‌ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. టివిఎస్‌విక్టర్‌ డిస్క్‌, డ్రమ్‌ఎంపికలతో ఆకర్షణీయమైన వైవిధ్యం కలిగిన గ్రాఫిక్స్‌ తో ఎరుపు, నలుపు, నలుపుఎరుపు, నల్లటి సిల్వర్‌గ్రే, సిల్వర్‌ బ్లూ రంగుల్లో లభిస్తుందని శ్రీనివాసన్‌ వివరించారు.