టిబి ఫ్రీ ఇండియానే లక్ష్యం: మోది

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: క్షయ వ్యాధిని 2025 లోగా రూపుమాపాలని ప్రధాని మోది అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఆయన టిబి సదస్సును ప్రారంభించారు. విదేశాలకు చెందిన అనేక మంది టిబి సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచం నుంచి టిబిని తరిమేందుకు 2030 వరకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నారని కానీ భారత్‌ ఐదేళ్ల ముందుగానే టిబిని అంతం చేయాలని ప్రధాని ఈ సందర్బంగా తెలిపారు. టిబి ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టిబి నిర్మూలనకు చేయూతనివ్వాలని అన్నారు. ముఖ్యంగా పేదల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ , డబ్లు హెచ్‌ ఓలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. 2016 లో టిబి వల్లసుమారు 17 లక్షల మంది మరణించారు.