టిడిపి – బిజెపి కార్య‌క‌ర్త‌ల‌ డిష్యుం డిష్యుం

TDP, BJP
TDP, BJP

నెల్లూరుః నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనలు చేపట్టారు. బీజేపీకి పోటీగా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు గాంధీబొమ్మ సెంటర్ వద్ద బాలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలాగే ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.