టిడిపి బడ్జెట్‌లో జవాబుదారీతనం లేదు

K PARTHASARATHI
K PARTHASARATHI

విజయవాడ: ఈరోజు టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై వైఎస్‌ఆర్‌సిపి కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతు టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు. మరోసారి రైతులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. రైతు సుఖీభవ పేరుతో కేటాయించిన రూ. 5 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారో అన్న విషయంపై స్పష్టత లేదని విమర్శించారు. రైతులకు రెండు విడతల్లో చెల్లించాల్సిన రుణమాఫీ రూ. 8300 కోట్ల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదన్నారు.