టిడిపి నేత రాజీనామా తిర‌స్క‌ర‌ణ‌

TDP
TDP

ఖ‌మ్మంః సీనియర్‌ న్యాయవాది, టీడీపీ ఖమ్మం జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు గోగుల బ్రహ్మయ్య రాజీనామాను ఆ పార్టీ అధిష్ఠానం తిరస్కరించింది. 30 ఏళ్లుగా పార్టీకి కంకణబద్ధుడై ఎన్‌టీఆర్‌ అభిమానిగా ఉన్న బ్రహ్మయ్య రాజీనామాను తాము తిరస్కరిస్తున్నామని, ఆయన సేవలు పార్టీకి చాలా అవసరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు గందం గురుమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావుతోపాటు బ్రహ్మయ్యకు రిజెక్ట్‌ లెటర్‌ పంపించారు, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సేవలందించేవారి అవసరం ఎంతైనా ఉందని, నాయకులంతా సమన్వయంతో కలిసి పని చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు.