టిడిపి తీర్ధం పుచ్చుకున్న రెడ్డి బ్ర‌ద‌ర్స్‌

TDP
TDP

పులివెందులః కడపజిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీ మారారు. పులివెందులలోని బలపనూరుకు చెందిన శ్రీనాథ్ రెడ్డి, నారాయణరెడ్డి సోదరులు రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే పార్టీ విధానాలు, నిర్ణయాలతో విసుగెత్తిన ఆ రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేతలు బీటెక్ రవి, సతీష్ రెడ్డి.. శ్రీనాథ్ రెడ్డి, నారాయణరెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు.