టిడిపి తీర్థం పుచ్చుకుంటున్న పలువురు నేతలు

TDP
TDP

కర్నూలు: ఏపిలో అధికార, ప్రతిపక్ష పార్టీలోకి భారీగా వలసలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికల దృష్ట్యా
తమకు పట్టులేని ప్రాంతాల్లో ఇప్పటినుంచే ఆపరేషన్‌ ఆకర్ష్‌్‌్‌కు అధికార, ప్రతిపక్షపార్టీలు తెరలేపాయి. ఆదివారం కర్నూలు
జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంటలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంతరెడ్డి 500 మంది మార్బలంతో
టిడిపిలో చేరారు. ఆయనతో పాటు కొందరు సర్పంచులు, మాజీ జడ్పీటిసిలు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా
ఎంఐఎం నేత అబ్దుల్‌ రెహమాన్‌ టిడిపి కండువా కప్పుకున్నారు. ఎంపీ టిజి వెంకటేష్‌తో సమక్షంలో ఆయన టిడిపి తీర్థం
పుచ్చుకున్నారు. అధికార పార్టీ చేపడుతోన్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు ఆయన ఈ సందర్భంగా
తెలిపారు. రెహమాన్‌తో పాటు పలువురు టిడిపిలో చేరారు.