టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా

విశాఖపట్టణం : టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పంపారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు.

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మ గౌరవం.. విశాఖ ప్రజల గుండె తప్పుడు… విశాఖ నగరం పేరే ఉక్కు నగరం. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీ లో జరుగుతోన్న రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతని చవిచూడాల్సి ఉంటుంది’అని గంటా ట్వీట్‌ చేశారు.