టిడిపి ఎంపీల అరెస్ట్‌.. దుర్మార్గానికి ప‌రాకాష్ఠ‌

N. Chandrababu
N. Chandrababu

ఢిల్లీలో టీడీపీ ఎంపీల అరెస్టు దుర్మార్గానికి ప‌రాకాష్ఠ  అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎంపీలతో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. ఎంపీల పట్ల   మానవత్వం లేకుండా ప్రవర్తించారని సీఎం మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దమన నీతికి ఇది పరాకాష్ట అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎంపీలను అడ్డుకోవడమే దారుణమన్నారు. ఏపీపై కేంద్రం చూపిస్తున్న వివక్ష, కక్ష్య సాధింపు చర్యలకు ఈ ఘటన నిదర్శనమన్నారు.