టిడిపి ఎంపీల‌ అరెస్ట్… మంత్రుల ఉద్ఘాట‌న‌లు

AP Minister Kala VenkatRao
Kala Venkat rao

అమరావతి: ఢిల్లీలో టీడీపీ ఎంపీల అరెస్ట్‌ను ఏపీ మంత్రులు కళా వెంకట్రావు, అమరనాథరెడ్డి ఖండించారు. ఎంపీల శాంతియుత నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. విభజన హామీల విషయంలో మోదీ మాట తప్పారని వ్యాఖ్యానించారు. మాట తప్పిన మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయడం తప్పుకాదని చెప్పారు. వైసీపీ ఎంపీలు డ్రామా దీక్ష చేస్తుంటే విజయసాయిరెడ్డి పీఎంవోలో టీ తాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీల అరెస్ట్.. ఏపీపై కేంద్రం వివక్షకు నిదర్శనమన్నారు. 16 నుంచి గ్రామస్థాయి నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీని బీజేపీ ఏవిధంగా వంచించిందో ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రులు జోస్యం చెప్పారు.