టిడిపి అవిశ్వాసానికి ఓకే!

sumitra mahajan copy
sumitra mahajan

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదం తెలిపారు. టిడిపి ఎంపి కేశినేని శ్రీనివాస్‌ ప్రతిపాదించిన ఈ తీఆర్మనంపై శుక్రవారం చర్చకు వస్తుందని స్పీకర్‌ వెల్లడించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలసభ్యులు మొత్తంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనలను అందచేసారని, టిడిపి ఎంపి కేశినేని శ్రీనివాస్‌ పేరు లాటరీలో రావడంతో ఆయన సొంతంగా తన తీర్మానాన్ని ప్రతిపాదించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోని ఎన్‌డిఎ కూటమినుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాని విస్మరించడంపై టిడిపి ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. జీరో అవర్‌లో ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభత్వుం అవిశ్వాసాన్ని ఎదుర్కొనకేందుకు సిద్ధంగా ఉందని, సభలో మూడింట రెండొంతుల సభలో మెజార్టీ తమదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులుకూడా ప్రత్యేకించి బడ్జెట్‌ సమావేశాల్లో ఒకపర్యాయం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే స్పీకర్‌ ఆ తీర్మానాన్నితిరస్కరించారు. సభ సజావుగా లేనందున ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీనితో మొత్తం ప్రతిపక్షపార్టీల్లో అత్యధిక పార్టీలు నిరసన వ్యక్తంచేస్తూ నిరంతరం సభలో అంతరాయ ం కలిగించాయి. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలుండగా మెజార్టీ 272 స్థానాలకు ఉంది. బిజెపికి 272స్థానాలున్నాయి. మిత్రపక్షాలు 39 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 48 స్థానాలు, ఎఐఎడిఎంకె 37 స్థానాలతోను, ఎఐటిసి 34స్థానాలు, బిజెడి 20స్థానాలు, ఇతరులు 89స్థానాల్లోప్రాతినిధ్యం వహిస్తుండగా నామినేటెడ్‌ఇద్దరు సైతం ఉన్నారు. ఖాళీగా నాలుగుస్థానాలున్నాయి. బుధవారం ప్రారంభం అయిన లోక్‌సభ సమావేశాల్లో పెద్ద ఎత్తున దుమారంతోనే ప్రారంభం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ, సమాజ్‌వాదిపార్టీ సభ్యులు వెల్‌లోనికి దూసుకువచ్చిన వివిధ సమస్యలు ప్రస్తావించారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించగానే ప్రతిపక్ష పార్టీలసభ్యులు కాంగ్రెస్‌ పార్టీతో సహా దేశంలోని వివిధ అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చించవచ్చని ఇపుడు అనుమతించబోమని స్పీకర్‌స్పష్టంచేసినా అనేకమంది సభ్యులు నినాదాలుచేస్తూ నిరసన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. టిడిపినుంచి సభ్యులు వెల్‌లోనికి దూసుకువచ్చి ప్లకార్డులు చేతబట్టి నినాదాలుచేసారు. మాకు న్యాయం కావాలి అంటూ సభ్యులు పెద్దపెట్టున నినాదాలుచేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌చేసారు. సమాజ్‌వాదిపార్టీనుంచి సైతం సభ్యులు వెల్‌లోనికి దూసుకువచ్చి తాము ప్రస్తావించిన సమస్యలపై చర్చించాలని నినాదాలుచేసారు. అనేక మంది కాంమగ్రెస్‌ సభ్యులు సైతం తమతమ స్థానాల్లో నిలుచుని నిరన వ్యక్తంచేసారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జోక్యంచేసుకుని ఎలాంటి అంశంపైన అయినా తాము చర్చించేందుకు సిద్ధమేనని స్పష్టంచేసారు. చతెల్లటి కుర్తాపైజామాలో వచ్చినమోడీ అధికారప్రతిపక్ష బెంచ్‌లముందుకు ముకుళిత హస్తాలతో వచ్చి సభ్యులందరినీ పలకరించారు. సమాజ్‌వాదిపార్టీ అగ్రజులు ములాయంసింగ్‌ యాదవ్‌తో కొద్దిసేపు చర్చించారు. సభ్యులుప్రధాని మోడీ సభలోనికి రావడంతోనే చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ తన ప్రభుత్వం ఎలాంటి చర్చకు అయినా సిద్ధమేనని సభలో కీలక అంశాలపై అన్నింటిపైనా చర్చిస్తామని వెల్లడించారు. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలపై చర్చకు తాము సిద్ధమేనని స్పష్టంచేసారు. యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇతరులు లోక్‌సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాలసమయం ముందు నలుగురు కొత్తసభ్యులచేత స్పీకర్‌ మహాజన్‌ ప్రమాణ స్వీకారంచేయించారు.