టిడిపికి ఎంపీ జెసి గుడ్‌బై?

J C DIwakar reddy
J C DIwakar reddy

టీడీపీ ఇచ్చిన అవిశ్వస తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ జరగనున్న విష‌యం విదితం. అత్యంత కీలకమైన ఈ సమయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలకబూనారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానని ఆయన స్పష్టం చేశారు. జేసీ ప్రకటన రాజకీయవర్గాల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. జేసీ ప్రకటన వెనుక పెద్ద రాజకీయమే ఉందని కొందరు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకత్వం కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. అయితే, ఆయన చేరికను జేసీ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈనెల 25 లోపల తన డిమాండ్లపై అధిష్ఠానం స్పందించాలని… లేకపోతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం.