టిటిడిలో ఆ 45మందికి ఊరట!

ttd
ttd

టిటిడిలో ఆ 45మందికి ఊరట!

తిరుమల: ప్రపంచప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మికసంస్థ తిరుమలతిరుపతి దేవస్థానంలో హిందూయేతర ఉద్యోగులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కొంత ఊరట లభించింది. హిందూధర్మం ప్రకారం ఉద్యోగులు గా కొనసాగుతున్న 45మంది ఉద్యోగులు అన్య మతం అవలంభిస్తున్నారని, ఆపై ప్రోత్సహిస్తు న్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలతో ఓడిప్యూటీ ఇఓ స్థాయి అధికారిణి టిటిడి వాహనంలో ఏకంగా చర్చికి వెళ్ళి ప్రార్థన లుచేస్తున్న ఫోటో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం విదితమే, దీంతో టిటిడిలో హిం దూయేతర ఉద్యోగుల విషయం పెద్దకళకలంరే పింది. దుమారాన్ని రేకెత్తించి చివరకు ఆ ఉద్యో గులు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు,ఎలా ఉద్యో గాలు పొందారనే పరిస్థితిలో టిటిడి క్షుణ్ణంగా విచారణ సాగించింది. ఈ విచారణలో వారివారి సర్వీసురిజిష్టర్‌లలో నమోదైన వివరాల మేరకు హిందూయేతర ఉద్యోగులు 45మందివరకు వున్నారని ధృవీకరించారు. అంతమందిని ఉద్యో గాల నుంచి తొలగించేందుకు టిటిడి అధికారులు రంగంసిద్ధంచేశారు.