టిటిడిపి మేనిఫెస్టో విడుదల

TTDP
TTDP

హైదరాబాద్‌: తెలంగాణ టిడిపి బుధవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎల్‌ .రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు.

అమరవీరుల కుటుంబంలో ఇంటికో ఉద్యోగం, ఇల్లు
– అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు
– లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు
– ప్రతి ఏటా ఉద్యోగ కాలెండర్‌ విడుదల
– తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ
– నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3వేల భృతి
– బెల్ట్‌షాపులు రద్దు
 – ప్రొ. జయశంకర్‌ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు

– విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి
– బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 5వేల కోట్లు
– హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటు
– ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు
– ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు
– ప్రగతి భవన్‌ ప్రజా ఆస్పత్రిగా మార్పు
– ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
– రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, కౌలు రైతులకూ వర్తింపు
– కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం
– ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌
– బీసీలకు సబ్‌ప్లాన్‌