టిజెఎస్ జిల్లా ఇంఛార్జిల నియామ‌కం

kodandaram
kodandaram

హైద‌రాబాద్ః నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి పార్టీ ఆయా జిల్లాలకు ఇ‌న్‌ఛార్జ్‌లను నియమించింది. ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, వరంగల్‌‌కు అంబటి శ్రీనివాస్, కరీంనగర్‌‌కు గాదె ఇన్నయ్య, వికారాబాద్‌కు శ్రీశైలం రెడ్డి, నిజామాబాద్‌కు గోపాల్ శర్మ, నల్గొండ‌‌కు విద్యాధర్ రెడ్డి, సిద్ధిపేట‌కు బైరి రమేష్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్లు తెలంగాణ జనసమితి ప్రకటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దిలీప్ మాట్లాడుతూ తమ సభను ప్రజలు ఆదరించారన్నారు.