టికెట్ డ‌బ్బులు తిరిగి ఇచ్చేందుకు హెచ్‌సీఏ అంగీకారం!

HCA
HCA

హైదరాబాద్: భార‌త్‌-అస్ర్టేలియా మ‌ధ్య ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగ‌తి తెలిసిందే. కాగా మ్యాచ్ ర‌ద్దు కావడంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. తాము చెల్లించిన టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వాలని హెచ్‌సీఏ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన హెచ్‌సీఏ డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చేది త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని, అప్పటి వరకు టికెట్లను భద్రంగా దాచుకోవాలని సూచించింది. అయితే టికెట్ డబ్బులు మొత్తం చెల్లిస్తారా? లేక పన్నులు మినహాయించుకుంటారా? అనే విషయంపై స్ప‌ష్ట‌త రాలేదు.