టిఎస్‌-ఈసెట్‌లో 97.42% హాజరు

TS ECET
TS ECET

హైదరాబాద్‌: తెలంగాణ ఈసెట్‌ -2018 బుధవారం నిర్వహించిన పరీక్షకు రాష్ట్రంలో 97.42% విద్యార్థులు హాజరైనారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈపరీక్షకు 26442 మంది రిజిస్టర్‌ చేసుకోగా..25761 మంది పరీక్ష రాశారు. అలాగే ఏపిలో 27657 మంది రిజిస్టర్‌ చేసుకోగా..26883 మంది (97.20%) హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణకు తెలంగాణలో 71 పరీక్ష కేంద్రాలను ఏపిలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, ఫార్మసీ తదితర డిప్లోమా కోర్సుల విద్యార్థులకు ఈ సెట్‌ను నిర్వహించినట్లు టిఎస్‌-ఈసెట్‌ కన్వీనర్‌ డా.ఎ. గోవర్ధన్‌ తెలిపారు