టిఆర్‌ఎస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతుంది

B VIKRAMARKA
B VIKRAMARKA

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతు టిఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు కోరుకున్నవేవీ నెరవేరలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలెవరూ పార్టీ మారరని ఆయన స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతుందని మండిపడ్డారు. కెసిఆర్‌ అధికారులను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.ఈసీ వైఫల్యంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈసీ పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడి నెలైనా కేబినెట్‌ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌‌‌లోని అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.