టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలను అవమానిస్తుంది

SmrutiIrani
SmrutiIrani

 

మెదక్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ మహిళకు మంత్రి పదవిని ఇవ్వకుండా అవమానించిదని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ఆరోపించారు. మోడి ప్రభుత్వ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని ఆమె అన్నారు. చేగుంటలో బిజెపి మహిళా శంఖారావం నిర్వహించింది. ఈ సభకు స్మృతీ ఇరానీ, బిజపి ముఖ్య నేతలు, దుబ్బాక నియోజకవర్గ మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సభలో ఇరానీ మాట్లాడతు కేంద్రం తెలంగాణకు 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని ఆమె చెప్పారు. కెసిఆర్‌ ప్రభుత్వం ఎందుకు ఆ ఇళ్లను కట్టించలేదని స్మృతీ ఇరానీ ప్రశ్నించారు.