టిఆర్‌ఎస్‌ చేనేతల ,చేతల సర్కారు: కేటిఆర్‌

KTR
KTR

హైదరాబాద్‌: మాది చేనేతల ,చేతల సర్కారు అని మంత్రి కేటిఆర్‌ పునరుద్ఘాటించారు. ఇవాళ శాసనమండలిలో చేనేత రుణాలు-హ్యాండ్‌లూమ్‌ రంగానికి సహాయం అనే అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ చేనేత రంగంలో చూసినా మనవారే ఉన్నారన్నారు. వ్యవసాయం తర్వాత తెలంగాణలో కీలక రంగం చేనేత రంగమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత పనిచేస్తున్న వారి లెక్కలే లేవన్నారు. 2002లో సిరిసిల్లలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు.