టిఆర్‌ఎస్‌ కు వంద సీట్లు ఖాయం

TS MINISTER KTR
TS MINISTER KTR

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయమని ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలోకెటిఆర్‌  పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత రాజకీయాలపై, అదేవిధంగా  కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో అది కూడా విద్యార్థులకే ఎక్కువ అవగాహన ఉందన్నారు  . టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోటిఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. నీళ్ల విషయంలో కోటి ఎకరాల మాగాణం కావాలనే సంకల్పంతో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుతున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వబోతున్నాం. తెలంగాణ మంచి ఆర్థిక ప్రగతిని సాధించిందిఅని కెటిఆర్‌  స్పష్టం చేశారు.