టిఆర్ఎస్లో చేరనున్న మోత్కుపల్లి ?

హైదరాబాద్: టిడిపి సీనియర్ నాయకుడు, ఆపార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలిసింది. విశ్వసనీ§ సమచారం ప్రకారం వచ్చే నెలలో కారు ఎక్కేందుకు సన్నాహాలన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈనెలాఖరులో తన అనుచరులు, టిడిపి కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరుపున మోత్కుపల్లి పోటీ చేయాలని భావినున్నారని చెబుతున్నారు. అయితే తుంగతుర్తి అసెంబ్లీ లేదా వరంగల్ లోక్‌సభ నుంచి ఏదో ఒక చోట పోటీ చేయాలని టిఆర్ఎస్ కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు మోత్కుపల్లిని పలుమార్లు కలిసి టిఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి బలహీన పడిందని, పార్టీని టిఆర్ఎస్లో కలపడమే మంచిదని గతంలో మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి నర్సింహులు టిటిపి-టిఎస్ పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. అంతేకాకుండా పార్టీ నాయకులకు అంటిముట్లనట్లుగానే వ్యవహరిస్తున్నారు. టిడిపిని…టిఆర్ఎస్లో విలీనం చేయాలనే ఆయన వ్యాఖ్యలపై పార్టీ వివరణ అడిగిన దాఖలాలు లేవు. ఈనేపథ్యంలో గురువారం భారీఎత్తున జరిగే పార్టీ మహానాడుకు పార్టీలోని సీనియర్ నేతలందరికి ఆహ్వానాలు పంపారు. మోత్కుపల్లి పంపలేదని సమాచారం. అయితే నర్సింహులు తాను టిడిపిని వీడుతున్నట్టు ఇప్పటి వరకు ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ టిఆర్ఎస్లో చేరేందుకు ఆయన తెరవెనుక రంగం సిద్దం చేసుకుంటున్నట్లు ప్రచారం ‘సాగుతోంది.