టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

TRS
TRS

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ మంత్రులు కేటిఆర్‌, జగదీశ్‌రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.