టిఆర్‌ఎస్‌కు ‘కూలి’ కష్టాలు

TRS-1
TRS

టిఆర్‌ఎస్‌కు ‘కూలి’ కష్టాలు

హైదరాబాద్‌: గులాబీకూలి పేరుతో తెలంగాణ రాష్ట్రం లో మంత్రులు స్వయంగా వసూలు చేసిన నిధులపై విచారించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ప్రజాప్రతినిధులుగా ప్రభు త్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్న వారు ఇలాంటి లాభదాయకమైన పను లు చేయడం, విలువైన కానుకలు స్వీకరించడం అవినీతి నిరోధక చట్టం 1988, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951కి పూర్తివ్యతిరేకమని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఢిల్లీహైకోర్టులో ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేస్తూ బహిరంగంగా కూలీల పేరిట కోట్ల రూపాయాలు వసూలు చేయడం, అవినీతి కిందకు వస్తుందని, అందుకే ఈ అంశాన్ని విచారించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రేవంత్‌ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదిగా చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈవిషయాన్ని విచారించిన తరు వాత రాజకీయ పార్టీ నిధుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను వెల్లడి స్తుందని కోర్టు అభిప్రాయపడింది. కాగా ఆయ రాజకీయ పార్టీలు నిధుల సమీక రణకు సంబంధించి తగిన చట్టాలున్నాయని, అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రక్రియలను అనుసరిస్తున్నాయంటే చట్టాల్లో ఉన్న లోపాలను దృష్టిసా రించాలని ఢిల్లీకోర్టు ఎన్నికల కమిషన్‌ను సూచించింది. అదేవిధంగా రేవంత్‌రెడ్డి లేవనెత్తిన ఇతర అంశాలను పరిశీలించి, ఎన్నికల సంఘం ఒక అభిప్రాయానికి రావాలనికోర్టు ఆదేశించింది.

గులాబీ కూలీ పనుల్లోభాగంగా పలువురు మంత్రు లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూలీ పనులు చేశారు. అందులో భాగంగా కెటిఆర్‌ ఐస్‌క్రీంలు అమ్మి రూ.7లక్షలు కూలీ కింద తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిన్నింగ్‌ మిల్లులో కొద్ది నిమిషాలు పనిచేసి 8.5లక్షలు సంపాదించారు. ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌రావు రైస్‌మిల్లులో పనిచేసి 6.27లక్షలు, హోంమంత్రి నాయిని బట్టలషాపు, ఇతర చోట్ల పనిచేసి రూ.20.52లక్షలు సంపాదించారు. ఎక్సైజ్‌ మంత్రి చేపలు, ఇతర పనుల ద్వారా రూ.38.50లక్షలు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ రైస్‌మిల్లులో మూటలు మోసి రూ.11లక్షలు తీసుకున్నారు. రవాణాశాఖ మంత్రి నర్సరీలో పనిచేసి రూ.10లక్షలు సంపాదించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి బిపి చెక్‌ చేసి రూ.5లక్షలు, మొత్తం కలిసి 16లక్షలు, తలసాని శ్రీనివాసయాదవ్‌ స్వీటు షాపులో మిఠాయిలు, ఇతరాల రూ.18.50లక్షలు సంపాదించారు. ఈ వివరా లన్నింటిని ఢిల్లీ హైకోర్టుకు రేవంత్‌రెడ్డి అందించారు. గులాబి కూలీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ భారీ నిధులు సమీకరించిందని రేవంత్‌ పిటిషన్‌పై హైకోర్టువిచారణకు ఆదేశించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.