టిఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కెసిఆర్‌

KCR
KCR

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆపార్టీ నుండి గెలిచిన 88 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ ఏకగ్రీవ తీర్మాన ప్రతిని మరికాసేట్లో కెసిఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు రాజ్‌భవన్‌లో అందజేయనున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు కెసిఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్‌, మంత్రివర్గం ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశం ఈ సాయంత్రానికి క్లియర్ అయ్యే అవకాశం ఉంది.