టిఆర్ఎస్ ప్లీన‌రీలో అంబ‌లి కేంద్రం ప్రారంభం

bontu rammohan
bontu rammohan

హైద‌రాబాద్ః ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం ప్రాంగణంలో అంబలి కేంద్రం ప్రారంభమైంది. ఏర్పాట్లను పరిశీలించిన నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్లీనరీ ప్రాంగణంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ 17వ ప్లీనరీ వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు పాల్గొన్నారు.