టాప్‌ 10 కంపెనీల్లో రూ.28,383 కోట్ల పెరుగుదల

Rupees
మార్కెట్లను వీడని అనిశ్చితి
3.53 బిలియన్‌ డాలర్ల బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ : మార్కెట్‌ విలువలపరంగా టాప్‌ పది సెన్సెక్స్‌ కంపెనీల్లో గత వారం 28,382.58 కోట్ల రూపాయలు పెరిగాయి. షేర్ల ర్యాలీతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడంతో ఈ కంపె నీలకు పంట పండింది. ఒఎన్‌జిసి మార్కెట్‌ విలువ లు 9154.37 కోట్లు పెరిగి 2,00,155.69 కోట్ల రూపాయలకు పెరిగింది. ఐటిసికంపెనీ 4779.31కోట్లు పెరిగి 2,59,608.76 కోట్లకు పెరిగింది. కోల్‌ ఇండియా 3695.07 కోట్లు పెరిగి 2,03,639.59 కోట్లకు చేరింది. టిసిఎస్‌ కంపెనీ 3,330.02 కోట్లు పెరిగి మొత్తం మార్కెట్‌ విలువలపరంగా 4,79,474.08 కోట్లకు చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2866.7 కోట్లు పెరిగి 3,24,212.65కోట్ల రూపాయలకు చేరగా ఇన్ఫోసిస్‌ 2273.97 కోట్ల రూపాయలు పెరిగి 2,51,710.68 కోట్ల రూపాయలకు చేరింది. హిందూస్థాన్‌యూనిలీవర్‌ మార్కెట్‌ విలువలు 898.01 కోట్ల రూపాయలు పెరిగి 1,86,796.15కోట్లకు చేరింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి సంస్థ మార్కెట్‌ విలువలు కూడా 805.02 కోట్లు పెరిగి 1,94,143.24కోట్లకు చేరింది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మార్కెట్‌ విలువలు 315.38 కోట్లకు చేరింది. మొత్తం మార్కెట్‌ విలువలు 2,70,982.09 కోట్లకు చేరింది. సన్‌ఫార్మా విలువలపరంగాచూస్తే 264.73 కోట్లు పెరిగి 1,90,494.92 కోట్లకుచేరింది. ర్యాంకింగ్‌ పరంగాచూస్తే టిసిఎస్‌ అన్నింటికంటే టాప్‌లో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా,ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి సన్‌ ఫార్మా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థలు వరుసవెంబడి ర్యాంకుల్లో నిలిచాయి. గతవారం సెన్సెక్స్‌ 319.49 పాయింట్లు పెరిగి 25,838.71 పాయింట్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలో అనిశ్చిత స్థితిలో కొనసాగే అవకాశాలున్నాయి. డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల కాలపరిమితి ముగియడంతో ఇన్వెస్టర్లు తేలికగా తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్లలో డెరి వేటివ్స్‌పొజిషన్లను ట్రేడర్లు తదుపరి నెలకు రోల్‌ఓవర్‌ చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ధోరణులు, డాలర్‌ రూపాయి మారకం విలువలు, ముడిచమురు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు కూడా మార్కెట్లపై ప్రభావంచూపిస్తాయి. ఎక్కు వగా ట్రేడర్లు తమ పొజిషన్లు కాంట్రాక్టు డెరివేటివ్స్‌ను జనవరి నెలకు మార్చుకునేందుకు సమాయత్తం అయ్యే అవకాశం ఉన్నం దున ఇన్వెస్టర్లు పెట్టుబడులు అంతంతమాత్రంగానే ఉంటాయ న్నది అంచనా. కేలండర్‌ సంవత్సరంలో ఇదే చివరి వారం కావడంతో ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లపరంగా అప్రమత్తంగా వ్యవహరి స్తారన్నది అంచనా. అంతర్జాతీయంగాకూడా సాధారణంగా మార్కె ట్ల కార్యకలాపాలు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నందున మందగమనంతో ఉంటాయి. డెరివేటివ్స్‌ కాలపరిమితి ముగుస్తుం డటం ఒక్కటే కీలక అంశంగా ఉంది. ఈనెల 28వ తేదీనుంచి జనవరి ఒకటవ తేదీవరకూ నడిచే వారంలో స్టాక్‌ మార్కెట్లు అనిశ్చిత స్థితిలోనే కొనసాగుతాయనిట్రేడ్‌స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్ సింఘా నియా వెల్లడించారు. స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు, వంటివి కొంత కీలకం అవు తాయని సిఎంటి డైరెక్టర్‌ క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చి డైరెక్టర్‌ వివేక్‌గుప్తా వెల్లడించారు. ఏడాదిచివరివారంలో సాధారణంగా మార్కెట్లలో కొనుగోళ్లకు అంతంతమాత్రంగానే ఆసక్తి చూపిస్తారని శాంకో సెక్యూరిటీస్‌ సిఇఒ జిమీత్‌ మోడీ వెల్లడించారు. భారత స్టాక్‌ మార్కెట్లు వచ్చే ఏడాది మరింతగావృద్ధిదిశగా నడుస్తాయని జియోజిత్‌పరిభాస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొంటున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కూడా ధృఢంగా ఉందని ఆయన అన్నారు.  అలాగే బంగారం అత్యధికంగా దిగుమతి చేసు కుంటున్న భారత్‌లో నవంబరునెల పసిడి దిగుమతులు 36.5 శాతం క్షీణించి 3.53 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. దీనితో భారత్‌ కరెంటుఖాతా లోటు కొంతమేర భర్తీ కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది అంటే నవంబరు 2014లో పసిడి దిగుమతులు 5.57 బిలియన్‌ డాలర్లవరకూ ఉన్నాయి. వాణిజ్యలోటు కూడా 9.78 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. గత ఏడాది 16.2 బిలియన్‌ డాలర్లకు ఉన్న వాణిజ్యలోటు తగ్గిందంటేకేవలం బంగారం దిగుమతులు తగ్గడం వల్లనేనని స్పష్టం అవుతోంది. ఏప్రిల్‌ – నవంబరునెలల మధ్యకాలంలో బంగారం దిగుమతులు 22.65 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 24.49 బిలియన్‌ డాలర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. 2014-15 సంవతంలో బంగారం మరింతగా దిగుమతులు జరిగాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ నిలిచింది. ముడిచమురు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతర్వాత బంగారం అత్యధికంగా భారత్‌కు దిగుమతి అయింది. గత ఏడాది దిగుమతులు కూడా 34.32 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కరెంటుఖాతా లోటుపరంగా స్థూల దేశీయోత్పత్తిలో 1.6శాతంగా 8.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వాణిజ్యలోటు తగ్గడంతోనే కరెంటుఖాతా లోటు కూడా దిగివచ్చింది.