టాప్-10లో తొలిసారి అప్ఘనిస్తాన్
టాప్-10లో తొలిసారి అప్ఘనిస్తాన్
షార్జా: నాలుగు రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో విజయం సాధించిన అప్ఘనిస్థాన్ తన ర్యాంకును కూడా మరింత మెరుగుపర్చుకుంది.కాగా ఈ విజయంతో అప్ఘనిస్థాన్ రెండు ర్యాంకులు పైకి ఎగబాకి 10వ ర్యాంకుకు చేరింది.దీంతో పసికూన అప్ఘనిస్థాన్ వన్డేల్లో తొలిసారి టాప్-10లో చోటు సంపాదించింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అప్ఘనిస్థాన్ మొదటిసారి టాప్ టెన్‌లో స్థానం సంపాదించగా,జింబాబ్వే మరింత కిందికి పడిపోయింది.ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్‌ను అప్ఘనిస్థాన్ కైవసం చేసుకుంటే 10వ ర్యాంకు పదిలంగా ఉంటుంది.ఒకవేళ సిరీస్‌ను కోల్పోయిన పక్షంలో తిరిగి 12వ ర్యాంకుకు చేరుతుంది.అప్ఘనిస్థాన్ తరువాత స్థానాల్లో ఐర్లాండ్,జింబాబ్వే నిలిచాయి.