టాటామోటార్స్‌, వోక్స్‌వ్యాగన్‌ భాగస్వామ్యం

VOLKS
VOLKS

టాటామోటార్స్‌, వోక్స్‌వ్యాగన్‌ భాగస్వామ్యం

ముంబై,: టాటాగ్రూప్‌ యాజ మాన్యం విదేశీ కార్ల ఉత్పత్తి సంస్థ వోక్స్‌ వ్యాగన్‌లు సంయుక్తంగా కార్లను ఉత్పత్తిచేసి మార్కెటింగ్‌కు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రపంచ ఆటోమోటివ్‌ రంగంలో ఇదొక పెద్ద మైలురాయిగా నిపుణులు చెపుతున్నారు. టాటామోటార్స్‌, వోక్స్‌ వ్యాగన్‌ ఎజి కంపెనీలు రెండూ కూడా తమ టెక్నాలజీలను భవిష్యత్‌ వాహన ఉత్పత్తికి పరస్పరం మార్పిడిచేసుకునేందుకు అంగీకరించాయి. ఇందుకు సంబంధించి ఒక ఒడంబడికపై రెండు కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సంతకాలుచేసారు. దీర్ఘకాలిక భాగస్వామ్యంగా సంయుక్తంగా కొత్త కార్లను వృద్ధి చేస్తామని రెండు బహుళజాతికంపెనీలు ప్రకటించాయి.

స్కోడా వోక్స్‌వ్యాగన్‌ తరపున బాధ్యత తీసుకుం టే టాటా కంపెనీ తన టెక్నాలజికల్‌ ఆధునీకరణ కింద లబ్ధి పొందుతుందని అంచనా. టాటా, స్కోడా కంపెనీలు రెండూ కూడా భారత్‌లోమొదట మాస్‌ మార్కెట్‌ సెగ్మెంట్లకు కొత్తకార్లను విడుదలచేసాయి. ఆ తర్వాతప్రీమి యం విబాగం వైపు వెళతాయని అంచనా. టాటామోటార్స్‌ ఎండి సిఇఒ గ్యూంటర్‌ బట్‌షెక్‌ మాట్లాడుతూ ఈ పరస్పర సహకారం పట్ల ఎంతో గర్వంగా ఉందన్నారు. వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌, స్కోడా కంపెనీల నుంచి ఈ సహకారం అందడం వల్ల మరింతగా సాంకేతికపరంగా వృద్ధిచెందే అవకాశం ఉం టుందని, రెండు కంపెనీలు కూడా స్మార్ట్‌ పరిష్కారాలతో భారతీయ విదేశీ మార్కెట్లకు మరింత ఆధునిక ఫీచర్లున్న కార్లను అందిస్తాయని అన్నారు. టాటామోటార్స్‌ భవిష్యత్‌ కు సంసిద్ధతను ఈ ఒప్పందం స్పష్టంచేస్తున్నదని, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రేసెమో స్పోర్ట్స్‌ కారును 87వ జెనీవా మోటార్‌షోలో ప్రదర్శించింది.

టామో ఉపబ్రాండ్‌గా రేసెమోను తెచ్చారు వోక్స్‌ వ్యాగన్‌ టెక్నాలజీలనుంచి కొంత లబ్ధి పొందుతుందని అంచనా. టాటా కంపనీ స్కోడా పరంగా విక్రయానంత సేవల్లో భాగం పంచుకుంటుంది. టాటామోటార్స్‌ ఈ రంగంలో 888పాయింట్లు స్కోర్‌ చేసింది. హుండైఇండియా తర్వాత రెండోస్థానంలో నిలిచింది. కస్టమర్లకు మరింత భద్రత, శ్రేయోదా యక ప్రయాణం మరింత భద్రతాఫీచరుఅందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందని నిపుణుల అంచనా. ప్రస్తుతం హైబ్రిడ్‌, ఎలక్డ్రిక్‌ వాహనాల వేగంగా ఉత్పత్తి అవుతున్నాయని, వీటికి 1.38 లక్షలు హైబ్రిడ్‌ లేదా విద్యుత్‌ వాహనాలకు సబ్సిడీ కూడా అందుతున్నందున కస్టమర్లకు ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందని టాటామోటార్స్‌ భావిస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌ ఎస్‌యువి ఆధారిత మోఫ్లెక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై రేసెమో తరహా వాహనాలను కూడా తీసుకురావాలని యోచిస్తోంది.