టాటాడొకొమోనుంచి అపరిమిత ఆఫర్‌!

TATA DOCOMO
TATA DOCOMO

హైదరాబాద్‌,జూలై 26: టాటాడొకొమో కొత్త డేటా ఆఫర్లను విడుదలచేసింది. 28జిబి
డేటాతోపాటు టాటానుంచి టాటాకు చేసుకునే వాయిస్‌కాల్స్‌లో అపరిమిత లబ్దిని చేకూరుస్తోంది.
కేవలం రూ.149 రీఛార్జితో వీటిని అందిస్తున్నట్లు ప్రకటించింది. అంధ్రప్రదేశ్‌ తెలంగాణ ప్రాంతాల్లోని
ప్రస్తుత కస్టమర్లందరికీ ఈ ప్యాక్‌ అమలవుతుందని, కాలపరిమితి 28రోజులుగా డొకొమో ప్రకటించింది.
కొత్త కస్టమర్లు కూడా రూ.149తో రీఛార్జి చేసుకుంటే అదనపు టాక్‌టైమ్‌ 20 రూపాయలు అందుతుంది. స్థానిక,
ఎస్‌టిడి మొబైల్‌ కాల్స్‌ ఒక పైసాకు రెండు సెకన్లు చొప్పున 28 రోజులకు అందుబాటులో ఉంటాయని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ ప్రసన్నదాస్‌ మాట్లాడుతూ 149 కొత్త ఆఫర్‌ కస్టమర్లను మరింతగా వృద్ధిచేస్తుందని
వెల్లడించారు. అత్యున్నతస్థాయి నాణ్యత కలిగిన డేటా ప్రయోజనాలతోపాటు నిరంతరాయంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీని
అందిస్తామని, అలాగే టాటానుంచి టాటాకు అపరిమిత కాలింగ్‌ సౌకర్యంకూడా ఉన్నట్లు వెల్లడించారు.