టయోటాకు మొత్తం 342 డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌

Toyota to start DSK
సంగ్లీలో డిఎస్‌కె టయోటా ప్రారంభం
సంగ్లి : టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తాజాగా మహారాష్ట్రలోని సంగ్లిలో తన 342వ డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. డిఎస్‌కె టయోటా కొత్తగా సంగ్లీ ప్రాంతంలో టయోటా డీలర్‌షిప్‌ తీసు కుంది. సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ తకేషి అమకాసు, డీలర్‌ప్రిన్సిపల్‌ షిరిష్‌కులకర్ణిలతో కలిసి ఈ షోరూం ప్రారంభించింది. డిఎస్‌కె గ్రూప్‌ 15 ఏళ్లుగా సంగ్లీలో ఆటోమొబైల్‌ పరంగా మంచి వ్యాపారాభివృద్ధితో ఉంది. విక్రయాలు, సేవలు, విడిభాగాలపరంగా కస్టమర్ల సం తృప్తిని చూరగొన్నది. కొత్త డీలర్‌షిప్‌తో టయోటా కిర్లోస్కర్‌మోటార్‌ మొత్తం 342 టచ్‌పాయింట్లు 228 నగరాల్లో ఏర్పాటు చేసింది. కేవలం 60 నిమిషాల్లోనే ఎక్స్‌ప్రెస్‌ మెయింటెనెన్స్‌ సేవలు అందుతాయని ఈ సందర్భంగాన్రపకటించారు. శిరీష్‌కులకర్ణి మాట్లాడుతూ పుణెలో మొట్టమొదటి డీలర్‌షిప్‌ప్రారంభించామని అప్పటినుంచి నేరుగా కొనసాగిస్తూనే ఉన్నట్లు చెప్పారు. డిఎస్‌కెటయోటా పరంగా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తామన్నారు.