జ‌హీర్ రికార్డును అశ్విన్ స‌మం

Ravichandran Ashwin
Ravichandran Ashwin

బెంగళూరు: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో వీర విజృంభణతో ఆఫ్ఘనిస్థాన్ జట్టును బెంబేలెత్తించిన టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అశ్విన్ దెబ్బకు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ రికార్డు బద్దలైంది. జహీర్ ఖాన్ 311 వికెట్లు తీసి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, అశ్విన్ 312 వికెట్లతో ఆ స్థానాన్ని ఆక్రమించి, జహీర్‌ను ఐదో స్థానానికి నెట్టేశాడు. అత్యధిక వికెట్ల జాబితాలో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), రవిచంద్రన్ అశ్విన్ (312), జహీర్ ఖాన్ (311) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.