జ‌ర్న‌లిస్టుల‌ ప‌క్కా గృహాల నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందిః మంత్రి కాల్వ‌

ap minister kalva
ap minister kalva

అమరావతి: జర్నలిస్టు సంఘాల నేతలు మంగళవారం మంత్రి కాల్వ శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి  కాల్వ మాట్లాడుతూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలుగా అమరావతిలో జర్నలిస్టులకు పక్కా గృహాల నిర్మాణం జరిపేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే అమరావతిలో గుంటూరు, విజయవాడ, తుళ్లూరు, మంగళగిరి ప్రాంత జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామన్నారు. విధివిధానాల రూపకల్పనకు పరకాల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిందని, అయితే ఎంత రాయితీ ఇవ్వాలనేది  సీఎం చంద్రబాబునాయుడు సూచన మేరకు నిర్ణయిస్తామని ఆయ‌న తెలిపారు.