జ‌మ్మూలో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు

 terrorists
terrorists

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొర జిల్లాలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రమీజ్‌ ఇంట్లోకి చొరబడి అతనిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రమీజ్ ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు  ఆయనను సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కుటుంబసభ్యులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొద్ది రోజుల క్రితమే రమీజ్ సెలవుపై ఇంటికి వచ్చారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం వారు పరారయ్యారు. తప్పించుకుని పోయిన
ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు చేపట్టాయి.