జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఆలోచ‌న బేష్ః ర‌జ‌నీ

RAJANI KANTH
RAJANI KANTH

జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచనలో అని త్వరలో రాజకీయాల్లోకి రానున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిప్రాయపడ్డారు. చెన్నైలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వన్‌ నేషన్‌ వన్‌ పోల్‌ ఆలోచన మంచిదేనని, జమిలి ఎన్నికల వల్ల డబ్బు సమయం రెండు ఆదా అవుతాయని, ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్ధతు ఇవ్వాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమిళనాడు అవినీతిమయం అయిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అభిప్రాయమని, ఈ విషయం గురించే ఆయన అడగాలని చెప్పారు.